కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో పీడిత కులాలు నుంచి వచ్చిన విద్యార్థులపై కుల వివక్షత చూపడంతో డ్రాపౌట్, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వీటి నివారణకు రోహిత్ వేముల చట్టం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శనివారం అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సంఘం కేయూ కన్వీనర్ దండు నవకిరణ్ అధ్యక్షతన దూరవిద్యా కేంద్రంలోని జాఫర్‌నిజాం సెమినార్ హాల్‌లో రోహిత్ వేముల యాక్ట్‌పై వివిధ విద్యార్థి సంఘాల, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా పలువురు పాల్గొని మాట్లాడారు.ఈ సమావేశంలో విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మినారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. అణగారిన వర్గాలు యూనివర్సిటీ, కళాశాల విద్యలోనికి ప్రవేశించడమే మహాత్తర పోరాటమన్నారు. ఏఎస్‌ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ దొంత ప్రశాంత్, కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల మాజీ డీన్ గాదె సమ్మయ్య, కేయూ అభివృద్ధి అధికారి వై.వెంకయ్య, ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పుల్లా శ్రీనివాస్, సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.బిక్షాలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు


