ఏఐ ఆధారిత సిలబస్‌తో మార్పులు | - | Sakshi
Sakshi News home page

ఏఐ ఆధారిత సిలబస్‌తో మార్పులు

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత సిలబస్‌ను ప్రవేశ పెట్టడంతో పాటు విద్యా, పరిశోధన, సాంకేతిక రంగాల్లో సమూల మార్పులు చేపడుతున్నట్లు కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శనివారం జేఎన్‌టీయూహెచ్‌లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన రీచ్‌–2026 సదస్సులో వీసీ మాట్లాడారు. విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చర్యలో భాగంగా 30 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులను జర్మనీకి పంపించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు.

పరిశ్రమలతో అనుసంధానం

పరిశోధనలకు ఊతమిచ్చే సంస్థల సహకారంతో సుమారు రూ.50 కోట్ల నిధులను సమీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వీసీ వెల్లడించారు. పరిశ్రమలు, యూనివర్సిటీల భాగస్వామ్యం బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సదస్సులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, వివిధ యూనివర్సిటీల వీసీలు, కేయూ ఓఎస్‌డీ బి.వెంకట్రామ్‌రెడ్డి, యూజీసీ కోఆర్డినేటర్‌ మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement