● 11 నుంచి అండర్–14 పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని డీడబ్ల్యూడీసీ మైదానంలో జిల్లా లీగ్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 400 మందికి పైగా క్రీడాకారులు హాజరైనట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. హోరాహోరీగా సాగిన ఎంపికల్లో ప్రతిభ గల క్రీడాకారులతో కూడిన 8 జట్లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న జట్లకు ఈ నెల11 నుంచి లీగ్ తరహా పోటీలు నిర్వహించి అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో అండర్–14 ఉమ్మడి వరంగల్ జిల్లా తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. డీడబ్ల్యూడీసీ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్, ఉపాధ్యక్షులు అచ్చ వెంకటేశ్వర రావు, తోట రాము, జిల్లా మాజీ కార్యదర్శి మార్నేని ఉదయ్‌భాను రావు, అసోసియేషన్ సభ్యులు పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, విజయ్, శంకర్, మెతుకు కుమార్, సురేశ్, మట్టెడ కుమార్, బండారి ప్రభాకర్, ఎ. వేణుగోపాల్, అఫ్జల్, రాజ్ కుమార్, సదానంద్ యాదవ్ హాజరయ్యారు.


