మట్టి నమూనాల సేకరణలో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

మట్టి నమూనాల సేకరణలో నాణ్యత పాటించాలి

Jun 18 2026 1:05 AM | Updated on Jun 18 2026 1:05 AM

గూడూరు: మట్టి నమూనాల సేకరణలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని హైదరాబాద్‌కు చెందిన క్వాలిటీ కంట్రోల్‌ (క్యూసీ) ప్రాజెక్టు మేనేజర్‌ ఎ.ఎస్‌. హరీశ్‌, కన్సల్టెంట్‌ బి.ఆర్‌. ఎం. రావు సూచించారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం అప్పరాజ్‌పల్లి, గోవిందాపురం, చక్రు తండా గ్రామాల్లో బుధవారం నేల, భూ వినియోగ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సర్వేతో నేల రకం, భూరక్షత, భూసారం, లోతు, నేల పరిరక్షణ, నేల కోత తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో ఉపగ్రహ చిత్రాల ద్వారా సాయిల్‌ ఫీల్డ్‌ సర్వే జరుగుతోందని, తద్వారా మట్టి నమూనాలు సేకరిస్తున్నామన్నారు. భూమి సాంద్రత, ఫెర్టిలిటీ సర్వేస్‌ ఎనాలిసిస్‌, కెమికల్‌ ఎనాలిసిస్‌ హైదరాబాద్‌ ల్యాబ్‌లో నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత మ్యాప్‌ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ డిజిటల్‌ సర్వేతో జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి నేలలు ఉన్నాయి? ఏ భూమిలో ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుంది? ఎరువులు ఎంత మోతాదులో వినియోగించుకోవాలో రైతులకు పూర్తి అవగాహన వస్తుందన్నారు. దీని వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి, దేశ వ్యవసాయ రంగానికి, స్థానిక రైతులకు మేలు జరుగుతుందన్నారు.

యువకుడిపై దాడి

ముగ్గురిపై కేసు

నల్లబెల్లి : యువకుడిపై దాడికి పాల్పడిన ముగ్గురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోడెం సాయి ప్రసన్న కుమార్‌ తెలిపారు. మండలంలోని రాంపూర్‌కు చెందిన గోదుమల శ్రీనివాస్‌ కుమారుడు రక్షిత్‌ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆటోలో కూర్చున్నాడు. ఈ సమయంలో గ్రామానికి చెందిన దుస్స వెంకన్న, బోయినల అశోక్‌, జలగం రాజు.. రక్షిత్‌తో గొడవపడి దుర్బాషలాడారు. గమనించిన శ్రీనివాస్‌ కుటుంబీకులు ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించగా రక్షిత్‌తో పాటు కుటుంబీకులపై దాడికి పాల్పడి చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుధవారం పేర్కొన్నారు.

తాటిపైనుంచి పడి గీత కార్మికుడి మృతి

చిల్పూరు: తాటిపై నుంచి పడి ఓ గీత కార్మి కుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జనగామ జిల్లా చిల్పూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తండ వెంకట్రాజం(51) రోజు మాదిరిగానే కల్లుగీయడానికి తాటివనానికి వెళ్లి చెట్టు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో మోకు జారడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలి పారు. మృతుడికి ము గ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement