● రక్తదాత తోట రాజేశ్వర్‌రావు
● ఎంజీఎంలో 135వ సారి రక్తదానం
కాశిబుగ్గ: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకోవడంలో ఉన్న సంతృప్తిలో ఎక్కడా ఉండదని ప్రముఖ ఫొటో గ్రాఫర్, ఆర్య సమాజం కార్యకర్త, రక్తదాత తోట రాజేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన 135వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రతీఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, మనం చేసే రక్తదానం ఇతరుల ప్రాణాలను కాపాడుతుందన్నారు. వైద్యుల సూచనల ప్రకారం ఎన్నిసార్లు రక్తదానం చేసినా సమస్యలు రావని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి రక్తం సకాలంలో అందించాలంటే దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత రక్తదానం చే స్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.


