
జ్వరంతో చిన్నారి మృతి
నర్సంపేట: జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన చెన్నారావుపేటలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బట్టి సంతోష్, సరిత దంపతుల కూ తురు మాన్య(2) వారం రో జులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో కు టుంబీకులు చిన్నారిని న ర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తీసుకెళ్లి చికిత్స చే యించాయి. శనివారం పరిస్థి తి విషమంగా ఉండడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు చిన్నారి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు.