ఎన్‌సీసీతో క్రమశిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీతో క్రమశిక్షణ

Aug 3 2025 8:28 AM | Updated on Aug 3 2025 8:28 AM

ఎన్‌స

ఎన్‌సీసీతో క్రమశిక్షణ

కమాండెంట్‌ కల్నల్‌ ఎస్‌ఎస్‌ రామదురై

కేయూ క్యాంపస్‌: ఎన్‌సీసీతో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కమాండెంట్‌ కల్నల్‌ ఎస్‌ఎస్‌ రామదురై అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో గత నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఎన్‌సీసీ పదో తెలంగాణ బెటాలియన్‌ వరంగల్‌ గ్రూప్‌ క్యాంపు శనివారం సాయంత్రం ముగిసింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఇక్కడ ఎన్‌సీసీ కేడెట్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 120 మందిని ఎంపిక చేశారు. అందులో డ్రిల్‌, బెస్ట్‌ క్యాడెట్స్‌, కల్చరల్‌, ఫ్లాగ్‌ఏరియా విభాగాల్లో ఎంపిక చేశారు.కార్యక్రమంలో క్యాంపు ఆడమ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రవిసునారే, కెప్టెన్‌ డాక్టర్‌ పి.సతీశ్‌, కెప్టెన్‌ డాక్టర్‌ ఎం. సదానందం, సుబేదారిమేజర్‌ జైరామ్‌సింగ్‌, రవీందర్‌, సందీప్‌, రాధాకృష్ణ, రాజమాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

తెగిన చెక్‌డ్యాంలు..

వృథాగా పోతున్న నీరు

నర్సింహులపేట : మండలంలోని జయపురం, ముంగిమడుగు శివారులోని ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు తెగిపోయాయి. ఈ చెక్‌డ్యాంలు తెగి ఏడాది దాటుతున్నా మరమ్మతు చేయకపోవడంతో నీరు వృథాగా పోతోంది. వీటితో పాటు కొమ్ములవంచలో ఆకేరు వాగుపై నిర్మించిన ఆనకట్ట గేట్ల లీకేజీతో నీరు నిల్వకుండా వాగులోకి వెళ్తోంది. ఫలితంగా వాగు చుట్టు ఉన్న బొజ్జన్నపేట, రామన్నగూడెం, జయపురం, ముంగిమడుగు, కొమ్ములవంచ గ్రామాల్లో సుమారు 900 నుంచి 1000 ఎకరాల్లో సాగుకు నీరులేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కాగా, తెగిన చెక్‌డ్యాంలపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

అప్పుల బాధతో

ఆత్మహత్యాయత్నం..

చికిత్స పొందుతున్న కూలీ మృతి

గీసుకొండ: అప్పుల బాధతో ఆత్మహత్యాయ్నతాని కి పాల్పడిన ఓ కూలీ.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గీసుకొండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చినగారి భాస్కర్‌(43) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టగా అప్పు అ య్యింది. దీంతో అప్పు తీర్చలేని స్థితితోపాటు కు టుంబాన్ని పోషించలేక గత నెల 25న గడ్డి మందు తాగగా వరంగల్‌ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ తెలిపారు.

ఎన్‌సీసీతో క్రమశిక్షణ 
1
1/2

ఎన్‌సీసీతో క్రమశిక్షణ

ఎన్‌సీసీతో క్రమశిక్షణ 
2
2/2

ఎన్‌సీసీతో క్రమశిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement