
డ్రగ్స్‌పై అవగాహనకే ప్రహరీ క్లబ్‌లు
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ప్రహరీక్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు ప్రహరీక్లబ్‌ల ఏర్పాటు, మాదద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడానికి భీమారంలోని స్కిల్‌స్టోర్క్ స్కూల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు..పాఠశాల హెచ్‌ఎం చైర్మన్‌గా, ఓ ఉపాధ్యాయుడు వైస్‌చైర్మన్‌గా, ప్రతీ తరగతి నుంచి ఒక బాలుడు, ఒక బాలిక చొప్పున ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రహరీ క్లబ్ కమిటీ ఉంటుందన్నారు. యాంటీడ్రగ్స్ నార్కొటిక్స్ బ్యూరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలల సమీపంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తే వెంటనే 1908కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్, జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఆచార్యులు రవికుమార్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో స్పాట్ అడ్మిషన్లు
హనుమకొండ జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు 4న అవకాశం కల్పించామని డీఈఓ వాసంతి తెలిపారు. ముల్కనూరు కేజీబీవీలో 22, ధర్మసాగర్ సీఈసీలో 15, ఎల్కతుర్తిలో 48, హసన్‌పర్తి సీఈసీలో 14, శాయంపేట బీపీసీలో 20, వేలేరు కేజీబీవీలో 33 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముల్కనూరు మోడల్ స్కూల్‌లో 158, కళాశాలలో 49, ఎల్కతుర్తి మోడల్ స్కూల్‌లో 234, కళాశాలలో 47, కమలాపూర్ మోడల్ స్కూల్‌లో 311 సీట్లు, కళాశాలలో 18 సీట్లు భర్తీకి అవకాశం కల్పించామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మార్కుల జాబితాలు, ఆధార్ కార్డు, టీసీతో సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లను కలిసి అడ్మిషన్లు పొందాలన్నారు.
హనుమకొండ డీఈఓ వాసంతి