
ప్రాణాలు ఫణం.. పనే ఆధారం!
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధి మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అనంతారం వైపునకు వెళ్లే మార్గంలో మూడో లైన్ రైల్వే పనుల్లో హెవీ వాట్స్ ఓహెచ్‌ఈ వైర్ కనెక్షన్ పనులు చేసే కార్మికులు పడుతున్న శ్రమ వర్ణనాతీతం. ప్రాణాలు ఫణంగా పెట్టి వైర్లపై నడుస్తూ కార్మికులు పని చేస్తుండడాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
పారదర్శకంగా
ఉపాధ్యాయుల పదోన్నతులు
● డీఈఓ రవీందర్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: పీఎస్‌హెచ్‌ఎంలకు, ఎస్‌ఏ ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా కొనసాగిస్తున్నామని డీఈఓ ఏ.రవీందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం పీఎస్‌హెచ్‌ఎంల, ఎస్‌ఏల ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 254 మంది ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను పరిశీలించామని, సోషల్ 62 మంది, ఇంగ్లిష్ 46 మంది, బయోసైన్స్ 32 మంది. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్‌తో 36 మంది, పీఎస్‌హెచ్‌ఎంల 78 మంది సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో పరిశీలించామన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు, సీనియార్టీ లిస్ట్ ప్రకారం పదోన్నతులు వస్తాయన్నారు.
సిల్వర్ మెడల్ అందుకున్న
అదనపు కలెక్టర్
మహబూబాబాద్: హైదారాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా మానుకోట అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సిల్వర్ మెడల్ అందుకున్నారు. జిల్లాలోని గంగారం మండలంలో ఉపాధి పనుల కొలతల్లో 6 పారా మీటర్లతో ఉత్తమ ప్రతిభ కనబర్చి 5 సూచికలు సాధించినందుకు రాష్ట్ర స్థాయిలో నీతి ఆయోగ్ కార్యక్రమానికి మానుకోట కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు ప్రభుత్వం సిల్వర్ మెడల్ ప్రకటించింది. దాంతోపాటు పలు కార్యక్రమాల్లో వందశాతం ఫలితాలు సాధించినందుకు ఈమెడల్‌కు ఎంపిక చేశారు. కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ మెడల్ అందుకోవాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో హాజరై మెడల్ అందుకున్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూరియా అధికంగా
వినియోగిస్తే హాని
మహబూబాబాద్ రూరల్: రైతులు తగిన మోతాదులో యూరియా వాడాలని మల్యాల కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ బి.క్రాంతికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయ నిర్మల అన్నారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా ప్రధానమంత్రి మోదీ 20వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు. ప్రధానమంత్రి 9.70 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. నానో యూరియా, నానో డీఏపీ వాడకాన్ని పెంచాలని, రైతులు బావుల మోటార్లకు పీఎం కుసుం స్కీంను వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త ఎల్.సుహాసిని పసుపు సాగులో రైతులకు పలు సూచనలిచ్చారు. మల్యాల కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ బి.క్రాంతికుమార్, మండల వ్యవసాయ అధికారి ఎన్.తిరుపతిరెడ్డి, ఏఈఓలు సాయిప్రకాశ్, రంజిత్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలు ఫణం.. పనే ఆధారం!

ప్రాణాలు ఫణం.. పనే ఆధారం!