
గిరిజనులు హక్కుల కోసం ఉద్యమించాలి
గూడూరు: రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం తెలంగాణ గిరిజనులు పాలక ప్రభుత్వాలపై ఉద్యమించాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర రామ్మూర్తినాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. స్థానిక అంగడి మైదానం నుంచి శనివారం ర్యాలీగా బయల్దేరి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లావుడ్యా రామునాయక్ అధ్యక్షతన టీజీఎస్ జిల్లా 2వ మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా రామునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే గిరిజనుల తలరాతలు మారుతాయనుకున్నా, కలలు అలాగే మిగిలిపోయాయన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా ఏర్పాటు చేశారు కానీ.. నిధులు కేటాయించక ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదివాసీ గ్రామాలపై, ఆదివాసీలపై ఊచకోత విధిస్తూ, అటవీ ప్రాంత గ్రామాలను ఖాళీ చేసే కుట్రలు పన్నుతోందన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ట్రైకార్ రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో గిరిజన గ్రామాలు, తండాలను అభివృద్ధి చేయాలని కోరారు. హక్కులు కల్పించకపోతే ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీ జీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్,అజయ్‌సారఽథి,మాలోతు రవీందర్‌నా య క్, బానోతు లింగ్యానాయక్, పద్మ పాల్గొన్నారు.
టీజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
రామ్మూర్తి నాయక్
గిరిజన సమాఖ్య జిల్లా మహాసభ