
‘భూ భారతి’తో భూసమస్యలు పరిష్కారం
గార్ల: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, భూభారతి రూపకర్త భూమి సునీల్ అన్నారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా శనివారం గార్ల సమీపంలోని ఓ రైతు పత్తి పంటను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి చట్టంపై సిబ్బందికి వివరించారు. ఈసందర్భంగా ఆయనను తహసీల్దార్ సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ ఓఎస్డీ హరిప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు, లీఫ్ సంస్థ ప్రతినిధులు తదితరులున్నారు.
ఎల్టీఆర్ చట్ట పరిధిలోనే భూమార్పులు
బయ్యారం: ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న ఎల్‌టీఆర్ చట్టానికి లోబడే కొత్త చట్టంలో భూమార్పులు ఉంటాయని రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్ అన్నారు. సాగున్యాయ యాత్రలో భాగంగా శనివారం బయ్యారంలోని రైతువేదికలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూభారతి చట్టం ప్రకారం భూమి ఉన్న ప్రతిరైతుకు పట్టాదారు పాస్‌బుక్ వస్తుందన్నారు.
రాష్ట్ర రైతు సంక్షేమ
కమిషన్ సభ్యుడు భూమి సునీల్