
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వేయి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్‌తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది.