మతంపేరుతో సాగుతున్న దౌర్జన్యాలను ఎండగట్టాలి | - | Sakshi
Sakshi News home page

మతంపేరుతో సాగుతున్న దౌర్జన్యాలను ఎండగట్టాలి

Mar 24 2025 6:56 AM | Updated on Mar 24 2025 6:55 AM

హన్మకొండ అర్బన్‌: మనువాద ముసుగులో మతంపేరుతో సాగుతున్న దౌర్జన్యాలను ఎండగట్టాలి.. మనువాదాన్ని ఓడించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని ప్రగతిశీల భావాలున్నవారిని కలుపుకుపోవాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలు పునిచ్చారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షత్రంలో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి వరంగల్‌ జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అతిథులుగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, గాయకుడు సుద్దాల అశోక్‌తేజ పాల్గొని ప్రసంగించారు. గోరటి వెంకన్న మా ట్లాడుతూ.. ప్రపంచంలో ఏ మతంలోనూ మనుషు ల మధ్య అసమానతలు లేవని.. కేవలం మనువా దంలోనే అసమానతలు ఉన్నాయన్నారు. సాధారణ జీవితం గడపడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నేర్పిస్తుందని చెప్పా రు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీమిలిటేషన్‌ పేరుతో సమాఖ్య స్ఫూర్తిపై దాడిచేస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న స్ఫూర్తి ని చాటినచోట ఒకే జాతి, ఒకే మతం, ఒకే ఎన్నికలు అంటూ కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారని దుయ్యబట్టారు. సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాలు, ఎర్ర జెండా ద్వారా స్ఫూర్తి పొంది తాను పాటలు రాయడం నేర్పుకున్నానని పేర్కొంటూ ఎస్‌ఎఫ్‌ఐతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్‌ పరిధి జిల్లాల నుంచి ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తరలివచ్చారు. కళాక్షేత్రం ఆవరణలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ మహ్మద్‌ రియాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్‌.వీరయ్య, కేయూ మాజీ వీసీ టి.రమేశ్‌, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్‌, నాయకులు జి.రాములు, ఎ.నర్సింహారెడ్డి, సీనియ ర్‌ జర్నలిస్ట్‌ కోల వెంకటేశ్వర్లు, శేషగిరిరావు, రమేశ్‌, పర్వతాలు, టి.ఉప్పలయ్య పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ సమ్మేళనంలో

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

పాల్గొన్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌,

సుద్దాల అశోక్‌తేజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement