మంత్రాలయం పీఠాధిపతికి హంసరాజ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

మంత్రాలయం పీఠాధిపతికి హంసరాజ పురస్కారం

Nov 30 2026 1:28 AM | Updated on Nov 30 2026 1:28 AM

మల్లన్న సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి అమ్మవారికి పల్లకీ సేవ నేటి నుంచి న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు సహా పలువురు ప్రముఖులు డాక్టరేట్లు అందుకున్నారు. ఆదివారం స్థానిక యోగీంద్ర మంటపంలో మైల్స్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పురస్కారంతోపాటు డాక్టరేట్లు అందజేశారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు హంస రాజ పురస్కారం అందజేశారు. శ్రీమఠం మేనేజర్‌ శ్రీనివాసరావు, గాయకులు సుస్వరం నాగరాజాచార్‌, అనంత కులకర్ణి, రమేష్‌ కులకర్ణి డాక్టరేట్లు పొందారు. సంస్కృత విద్యాపీఠం ప్రిన్సిపాల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకున్నారు. యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ రవి ఆచార్య చేతుల మీదుగా ఈ పురష్కారాల ప్రదానం జరిగింది.

జిల్లాకు ‘సురక్షిత్‌ హోదా’

కర్నూలు(సెంట్రల్‌): జిల్లా స్థాయిలో ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణలో 95–95–95 లక్ష్యాల సాధనతో కర్నూలు జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సురక్షిత్‌ హోదాను కట్టబెట్టింది. ఈ మేరకు డిసెంబర్‌ 1న ఎయిడ్స్‌ డే సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున సన్మానం పొందాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.సిరికి ఆహ్వానం పంపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది కృషితోనే సాధ్యమైందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పనిచేసి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు.

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తంగిరాల మాధవి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదివారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన వీరికి రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తంగిరాల మాధవి దంపతులకు వేదపండితులు వేద మంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈఓ స్వామి వారి శేష వస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందించి సత్కరించారు.

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవ మూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఆశీనులు గావించి వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

నంద్యాల(వ్యవసాయం): ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాత్రి కోర్టుల పని విధానాన్ని నిరసిస్తూ అడ్వకేట్‌ రాష్ట్రస్థాయి జేఏసీ బెజవాడ తీర్మానం మేరకు సోమవారం నుంచి న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జీవీఎన్‌ ప్రసాద్‌, ఉపాధ్యక్షులు ప్రతాపరెడ్డి, గౌరీశంకర్లు ఆదివారం అసోసియేషన్‌ కార్యాలయంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాత్రి కోర్టుల పని విధానాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. న్యాయవాదులు, న్యాయవాది గుమస్తాలు, కక్షిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement