మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం ఉండేది. దానిని పోగొట్టుకునేందుకు మ్యాథ్స్‌బీ గురించి విని వెంటనే నా పేరు నమోదు చేసుకున్నాను. సాక్షి, అరేనా స్కూలు ఫెస్టు వారు ఇచ్చిన మెటీరియల్ చదివి చాలా ట్రిక్కులు నేర్చుకున్నాను. ఇప్పుడు మ్యాథ్స్‌పై భయం పోయింది.
– విరాట్, 9వ తరగతి, ఎడిఫై స్కూలు, కర్నూలు
నేను ముందుగా సాక్షికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు సాక్షి ముందుడుగు వేయడం చాలా సంతోషం. నేను మ్యాథ్స్ బీ పరీక్షకు హాజరయ్యారు. మూడో దశకు వెళ్తానన్న నమ్మకం పెరిగింది.
– గగణ్, 7వ తరగతి, ఎడిఫై స్కూలు, కర్నూలు
నేను స్పెల్‌బీ, మ్యాథ్స్ బీ పరీక్షలకు హాజరయ్యాను. ఇంగ్లిషులో మంచి పట్టు సాధించాను. మ్యాథ్స్‌లో సులభ పద్ధతులు నేర్చుకున్నాను. ఇవి నాకు భవిష్యత్‌లో ఉన్నత తరగతులకు ఎంతో ఉపయోగపడతాయి, నాలోని భయం కూడా వెళ్లిపోయింది.
– జయాన్స్, నాలుగో తరగతి, ఎడిఫై స్కూలు


