నేను ఇంగ్లిషులో మంచిపట్టుసాధించా. వకాబులరీ, స్పీచ్, లిజనింగ్, స్పెల్లింగులు ఎన్నో నేర్చుకున్నా. గతంలో ఉన్న ఎన్నో అనుమానాలకు స్పెల్‌బీతో సమాధానాలు వచ్చాయి. భవిష్యత్‌లో ఇంగ్లిషు సబ్జెక్ట్ అంటే భయపడను. నాకు ఏకాగ్రత కుదిరింది.
–వినీషా, 4వ తరగతి, ఎడిఫై స్కూలు, కర్నూలు
స్పెల్‌బీ పరీక్షకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. ఎన్నో కొత్త పదాలు నేర్చుకున్నా. కష్టమైన పదాలకు అర్థాలు ఎలా రాయాలో...అర్థాలు ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్నారు. థ్యాంక్స్ టు సాక్షి. ఇది నా భవిష్యత్‌కు ఎంతో ఉపయుక్తం.
– దానియేల్, 7వ తరగతి,
ఎడిఫై స్కూలు,కర్నూలు
స్పెల్లింగులు రాయడంలో చాలా ఇబ్బంది ఉండేది. వాటిని పలికే విధానంపై గందరగోళం ఉండేది. ఇక్కడ ఒక పదాన్ని ఎలారాయాలి, ఎలా పలకాలన్న దానిపై స్పష్టంగా వివరించారు. దీంతో ఇక ఏ పదాన్నైనా సులభంగా పలికేస్తా...రాసేస్తా. ఇంగ్లిషుపై భయం పోయింది.
–టి.మాన్వి, ఒకటో తరగతి,
ఎడిఫై స్కూలు, కర్నూలు


