విద్యుదాఘాతంతో నెమలి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో నెమలి మృతి

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

చాగలమర్రి: మండల కేంద్రంలో సోమవారం జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి అడ్డువాగు కాలువ మీదుగా పాత హైవే పైకి చేరుకుంది. జన సంచారంలోకి వచ్చిన నెమలి భయపడి సమీపంలోని 11 కేవీ విద్యుత్‌ తీగలపైకి ఎగరడంతో విద్యుదాఘాతానికి గురై గాయపడింది. స్థానికులు గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే డి.వనిపెంట సెక్షన్‌ అధికారి టి. రామకృష్ణ అక్కడికి చేరుకుని గాయపడిన నెమలికి వైద్య చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేస్తామని అటవీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement