● కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిన అధికారులు
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు ఇటీవలే కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్లకు స్థానాలు కేటాయించేందుకు సమగ్ర శిక్ష కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. టీచర్ల మధ్య సీనియారిటీ విషయంలో స్పష్టత కోసం కొంత ఆలస్యంగానే కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. కూర్చునేందుకు సరైన సదుపాయాలు లేక ఎంటీఎస్ టీచర్లు అవస్థలు పడ్డారు. కనీసం తాగేందుకు కూడా నీటి సదుపాయం కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 149, అలాగే 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 180 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లలో పనిచేసే వారికి కౌన్సెలింగ్ నిర్వహించ లేదని తెలుస్తోంది. కొత్త టీచర్లు వచ్చేంత వరకు అక్కడే పని చేయాల్సి ఉంటుందని అధికారులు వారికి సూచించారు. కౌన్సెలింగ్‌ను డీఈఓ ఎల్.సుధాకర్, డిప్యూటీ డీఈఓ శ్రీధర్ బాబు పర్యవేక్షించారు.


