మంత్రాలయంలో సోమయాగం | - | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో సోమయాగం

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో ఆదివారం వేదపండితులు సోమయాగంను ప్రారంభించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆజ్ఞానుసారం ఈ యాగం 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమయాగంతో దేశంలో వైపరీత్యాలు వైదొలగి సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ హోమం చేపడుతున్నట్లు చెప్పారు. రాఘవేంద్రస్వామి ఆశీస్సులు ప్రజలకు ఉండాలన్నారు.

పందికోన మలలో నెమళ్లు

పత్తికొండ: వాన పడిన సమయంలో నెమళ్లు పూరి విప్పి నాట్యం చేస్తే చూపరులకు కనువిందుగా ఉంటుంది. అలాంటి నెమళ్లు ఆవాసంగా పందికోన మల మారింది. పత్తికొండ పట్టణ శివారు నుంచి పందికోన, పెండ్లిమాన్‌తండాల నడుమ వేలాది ఎకరాల్లో పందికొన మల విస్తరించి ఉంది. వన్య ప్రాణాలు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పందికోన మలలో నాలుగు దిక్కుల్లో వందలాది నెమళ్లు పొలాల్లో సంచరిస్తూ కనువిందు చేస్తున్నాయి.

కందిసాగుకు 4,300 మినీకిట్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఆత్మనిర్భర్త ఇన్‌ పల్సెస్‌ కింద జిల్లాలో కంది సాగును ప్రోత్సహించనున్నారు. ఈ పథకం కింద ఎల్‌ఆర్‌జీ–105 రకం కంది విత్తనాలు 172 క్వింటాళ్లను మినీకిట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. మొత్తం 4,300 కందుల మినీకిట్లు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఎల్‌ఆర్‌జీ–105 రకం విత్తనాలను 100 శాతం సబ్సడీతో పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ఎల్‌ఆర్‌జీ–52 రకం కంది విత్తనాలను 50 క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. కిలో పూర్తి ధర రూ.120.50 ఉండగా రూ.30 రాయితీ ఉంటుంది. నాలుగు కిలోల ప్యాకెట్‌కు సబ్సిడీ పోను రైతులు రూ.362 చెల్లించాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement