బెల్టు షాపులపై దాడులు | - | Sakshi
Sakshi News home page

బెల్టు షాపులపై దాడులు

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

కర్నూలు: అక్రమ మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎకై ్సజ్‌ అధికారులు దాడులు విస్తృతం చేశారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎ కై ్సజ్‌ జిల్లా అధికారి సుధీర్‌ బాబు ఆదేశాల మేరకు ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణా రెడ్డి, కర్నూలు ఎకై ్సజ్‌ స్టేషన్‌ సీఐ చంద్రహాస్‌, ఎస్‌ఐలు రెహనా, మారుతీ ప్రసాద్‌, తేజ తదితరులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. కర్నూలుకు చెందిన సుధాకర్‌ పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసుపల గ్రామానికి చెందిన జ్యోతి వద్ద నుంచి 7 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా బెల్టు షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురిపై కూడా కేసు నమోదు చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవకద్రకు చెందిన రఫిక్‌, కల్లూరుకు చెందిన దస్తగిరి, కర్నూలుకు చెందిన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement