నందవరం: బురద నీరు తాగలేక చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, జొహరాపురం గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాలకు నెదార్లాండ్ స్కీమ్ నుంచి కుళాయి పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నదికి వరద నీరు చేరింది. దీంతో నెదార్లాండ్ స్కీమ్‌లో వాటర్‌ను శుద్ధి చేయకుండా పంపిణీ చేస్తున్నారు. నీరు బురద మయంగా మారాయని, దుర్వాసన వస్తున్నాయని, ఎలా తాగాలని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌డబ్ల్‌ూయ్వస్ అధికారులు స్పందించి మంచి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.


