ఆశల సేద్యానికి తాళం! | - | Sakshi
Sakshi News home page

ఆశల సేద్యానికి తాళం!

Jun 20 2026 11:07 AM | Updated on Jun 20 2026 11:07 AM

న్నో ఆశలతో సేద్యం చేయడానికి యూరియా కోసం వచ్చిన రైతులకు తాళం వేసిన కోసిగి వ్యవసాయ కార్యాలయం వెక్కిరించింది. కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు వరకు అధికారుల కోసం వీరంతా ఎదురు చూడాల్సి వచ్చింది. వ్యవసాయ సహాయక అధికారి ఆలస్యంగా వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఉందని వెళ్లి పోయారు. రైతులు మాత్రం మధ్యాహ్న 12 గంటలకు వరకు అక్కడే ఉన్నారు. వీరికి ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. రెండు రోజులుగా ఇదే దుస్థితి. ఈ విషయమై వ్యవసాయాధికారి ఎం.వరప్రసాద్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ సిబ్బందికి బీఎల్‌ఓ విధులు ఉన్నాయని, మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. రైతుసేవా కేంద్రాల్లో యాప్‌లో రిజిష్ట్రేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే యూరియా అందజేస్తున్నట్లు చెప్పారు. –కోసిగి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement