చిప్పగిరి మండలం కాజీపురం రిజర్వాయర్ నుంచి తొమ్మిది గ్రామాలకు సరఫరా అయ్యే నీరు పూర్తి కలుషితమవుతోంది. కుళాయిల ద్వారా వస్తున్న బురద నీరు తాగేందుకు ఏ మాత్రం పనికిరాని పరిస్థితి నెలకొంది. ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసి గ్రామాలకు వదులుతున్నారు. ఫిల్టర్‌బెడ్లు లేని కారణంగా రిజర్వాయర్‌లోకి వచ్చిన నీటిని యథాతథంగా సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. కొందరు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు.
– బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే
పలు ప్రాంతాల్లోని నీటి పథకాల ఫిల్టర్ బెడ్లు మార్చేందుకు చర్యలు చేపట్టాం. ఈ నేపథ్యంలోనే 19 నీటి పథకాల ఫిల్టర్‌బెడ్ల నిర్వహణకు రూ.6 కోట్లు అవసరమవుతాయని జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. క్షేత్ర స్థాయిలో సమ స్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నాం.
– సీహెచ్ మనోహర్, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
బాపురం రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్న మంచినీరు శుభ్రంగా రావడం లేదు. నీరు ఫిల్టర్ కాకపోవడం వల్ల బురద, నాచు నీటిలో వస్తున్నాయి. ఈ నీరు తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారు. శుభ్రమైన నీటిని సరఫరా చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – నాగరాజు, బాపురం, హాలహర్వి


