హొళగుంద: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాంలో బుధవారం నాటికి 9.903 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 319 క్యూసెకులు ఉండగా.. బళ్లారి పట్టణానికి, ఆర్‌బీసీ కాలువలకు 380 క్యూసెక్కుల (అవుట్‌ఫ్లో) నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1605.27 అడుగుల వద్ద 29.145 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్‌ఫ్లో 14,621 క్యూసెక్కులు నమోదైంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలాఉంటే బళ్లారి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు బుధవారం టీబీ డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారు. దాదాపు 180 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. ఎల్లెల్సీకి వదులుతున్న నీరు బళ్లారి పట్టణానికి మాత్రమే కావడంతో ఆంధ్ర ప్రాంత రైతులు నిరాశకు లోనవుతున్నారు.


