పొలాలన్నీ ఇసుక దిబ్బలే! | - | Sakshi
Sakshi News home page

పొలాలన్నీ ఇసుక దిబ్బలే!

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

ఏ పొలం చూసినా ఇసుక దిబ్బలే..

కుంబళనూరు–నదిచాగి మెయిన్‌ రోడ్డుకు ఇరువైపుల పొలాలన్నీ ఇసుక దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలో ఇసుక రీచ్‌ నిర్వహిస్తున్నారు. అయితే కుంబళనూరు కొత్త గ్రామం నుంచి పాత గ్రామం వరకు పొలాలన్నింటినీ నిర్వాహకులు రెండింతల కౌలుకు మాట్లాడుకున్నారు. ఇక ఏ పొలం చూసినా ఇసుకతో నింపేస్తున్నారు. ఈ కారణంగా వాహనదారులు ఈ దారిలో ప్రయాణమంటే చుక్కలు చూస్తున్నారు. కొద్దిగా గాలి వస్తే చాలు ఇసుక కళ్లలో పడుతుండటంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు నోరు మెదపకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం.

– కౌతాళం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement