టీడీపీ కాంట్రాక్టర్లకు డబ్బు సంపాదనపై ఉన్న శ్రద్ధ చేస్తున్న పనులపై ఉండటం లేదనేందుకు ఈ రోడ్డే నిదర్శనం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, పట్టణ నడిబొడ్డున నిర్మించిన రోడ్డు పట్టుమని వంద రోజులు కాకమునుపే గుంతలు తేలడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమీషన్ల బాగోతమే ఈ నాసిరకం పనులకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పత్తికొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు దాదాపు 2.60 కిలోమీటర్ల ప్రధాన రహదారిని రూ.2.75కోట్లతో నాలుగు నెలల కిందట నిర్మించారు. పనులు నాసిరకంగా చేపట్టడంతో రెండు వారాలకే చాలాచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. రెండు రోజుల కిందట కురిసిన మొదటి వానకే అంబేడ్కర్ సర్కిల్ ప్రధాన రహదారి ఎక్కడికక్కడ గుంతలు తేలుతోంది. అయితే కాంట్రాక్టర్ కనీస మరమ్మతులు చేపట్టకపోవడం చూస్తే అధికారుల పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.
– పత్తికొండ


