ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్‌పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి డాక్టర్‌ ఉమ ఆదేశించారు. కర్నూలు మెడికల్‌ కాలేజీలోని న్యూ లెక్చరర్‌ గ్యాలరీలో బుధవారం కర్నూలు పట్టణ వార్డు ఆరోగ్య కార్యకర్తలకు పల్స్‌పోలియో కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉమ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహించే జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అర్హులైన పిల్లందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు. పోలియో బూత్‌లతో పాటు బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ప్రత్యేక మొబైల్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల్లోనూ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్కలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి ఆమె వివరించారు. మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రఘు, వైద్యాధికారులు, సచివాలయం సిబ్బంది, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement