రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

వెల్దుర్తి: పట్టణ పరిధిలోని డోన్‌వైపు రైల్వే గేటు దాటిన తర్వాత హైవే–44పై యూ టర్న్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతులూరి ఆచారి (68) మృతి చెందాడు. వివరాలు.. మండల పరిధిలోని ఎల్‌ నగరంకు చెందిన పోతులూరి ఆచారి రైతు పనితో పాటు వడ్రంగి వృత్తి చేసేవాడు. ఐదు నెలల క్రితం నుంచి వెల్దుర్తికి వచ్చి ఇక్కడే నివాసముంటున్నాడు. బుధవారం కృష్ణగిరి మండలంలో బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు తన టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోటార్‌ సైకిల్‌పై వెళ్తూ పట్టణ రహదారి నుంచి హైవేలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో ఒరిస్సాకు చెందిన శుభమ్‌ తన స్పోర్ట్స్‌ బైక్‌పై హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకు వెళ్తూ టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ను ఢీకొట్టాడు. కింద పడ్డ పోతులూరి ఆచారి కాలికి గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. హైవే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 108 వాహనంలో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య శంకరమ్మ, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement