ఎస్‌ఐఆర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ఈ నెల 15న మొదలైంది. ప్రతీ బీఎల్‌ఓ ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చి ఓటరు ఉన్నారా? లేదా? విచారించి అప్పుడు మ్యాపింగ్‌ చేయాలి. అయితే బీఎల్‌ఓలు మాత్రం 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితా టేబుల్‌పై పెట్టుకుని ఇ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ఈ నెల 15న మొదలైంది. ప్రతీ బీఎల్‌ఓ ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చి ఓటరు ఉన్నారా? లేదా? విచారించి అప్పుడు మ్యాపింగ్‌ చేయాలి. అయితే బీఎల్‌ఓలు మాత్రం 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితా టేబుల్‌పై పెట్టుకుని ఇ

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

ఇదేం మ్యాపింగ్‌ ‘సర్‌’

నంద్యాల జిల్లాలో

మ్యాపింగ్‌ సమాచారం

కర్నూలు జిల్లాలో

● ఈ నెల 14వ తేదికి ఆదోనిలో 89.17శాతం మ్యాపింగ్‌ పూర్తయింది. ఆదోనిలో 2002లో కౌతాళం మండలం ఉండేది. ఆలూరు నియోజకవర్గంలోని కొన్ని పల్లెలు ఉండేవి. ఇవన్నీ ఇప్పటి జాబితాతో 89.17 శాతం మ్యాపింగ్‌ చేశారంటే ఎంత గమ్మత్తుగా ఉందో ఇట్టే తెలుస్తోంది.

● ఆలూరు నియోజకవర్గంలో 2002లో ఇప్పటి ఆదోని మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 84.54 శాతం మ్యాపింగ్‌ చేశారు.

● మంత్రాలయం మండలం 2002లో ఎమ్మిగనూరు పరిధిలో ఉండేది. ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గం. ఇక్కడ 82.15 శాతం మ్యాపింగ్‌ చేశారు.

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎస్‌ఐఆర్‌ను ఎన్నికల సంఘం నిర్వహించడం సర్వసాధారణమే. అయితే పశ్చిమబెంగాల్‌లో దాదాపు 90లక్షల ఓట్లు తొలగింపు తర్వాత ఈ ప్రక్రియపై కూడా దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగినా ప్రభుత్వ యంత్రాంగం అధికారపక్షం కనుసన్నల్లో నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో ‘ఎస్‌ఐఆర్‌’ జరుగుతున్న తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల తర్వాత జరిగే ఈ ప్రక్రియలో చనిపోయిన వారు, వలసలు, డబుల్‌ ఎంట్రీలు చాలా ఉన్నాయి. ప్రతీ ఇల్లు డోర్‌ టు డోర్‌ తిరిగి, వారికి రెండుచొప్పున ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన తర్వాత జూలై 14లోపు వాటిని తిరిగి బీఎల్‌ఓలకు అందజేయాలి. ఆపై మాత్రమే మ్యాపింగ్‌ చేయాలి. సెప్టెంబర్‌ 22న తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ నెల 14కే 76.74 శాతం మ్యాపింగ్‌ అధికారులు పూర్తి చేశారు. బీఎల్‌ఓలు ఏ ఇంటికి వెళ్లారు? ఎవరిని విచారించారు? అనేది జిల్లాలో ఏ ఒక్క ఓటరుకు తెలీదు. మీడియాకు సమాచారం లేదు. అలాంటప్పుడు జూన్‌ 15 కంటే ముందుగానే మ్యాపింగ్‌ బీఎల్‌ఓలు ఎలా చేశారు? అందులో పారదర్శకత ఎంత అనేది తేలాల్సిన ప్రశ్న.

అధికారుల ఒత్తిడితోనే

76.74 శాతం మ్యాపింగ్‌

జిల్లా అధికారుల ఒత్తిడితోనే మ్యాపింగ్‌ హడావుడిగా చేసినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులే చెబుతున్నారు. ‘ఏం చేస్తాం సార్‌! మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే 2002 ఓటరు జాబితాను పెట్టుకుని మ్యాపింగ్‌ చేశాం. నిజానికి మీరు చెప్పినట్లు డోర్‌ టు డోర్‌ తిరిగి మ్యాపింగ్‌ చేస్తూ ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వాలి’ అని చెబుతున్నారు. ఇప్పటికే 76.74 శాతం పూర్తయింది. కోడుమూరులో 79.13, పత్తికొండలో 78.59, ఎమ్మిగనూరులో 76.73, పాణ్యం 69.53, కర్నూలులో 58.04 శాతం మ్యాపింగ్‌ పూర్తయింది. ఇళ్లు తిరగకుండా మ్యాపింగ్‌ చేసిన అధికారులు ఎన్యుమరేషన్‌ ఫారాల తర్వాత కూడా ఓటర్ల గుర్తింపు, తొలగింపులో ఏ మాత్రం పారదర్శకత పాటిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం

● ఒక పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ఓటరు మరో బూత్‌కు ఇల్లు మారి ఉంటారు. వీరి ఓటు బదిలీ చేసి మ్యాప్‌ చేయాలి.

● చనిపోయిన వారి ఓట్లు మ్యాపింగ్‌ చేయకూడదు. పూర్తిగా తొలగించాలి.

● జిల్లా వాసుల ఓట్లు పల్లెలు, పట్టణాలతో పాటు హైదరబాద్‌, బెంగళూరులోనూ ఉన్నాయి. అంతర్‌ రాష్ట్రాల పరిధిలోని ఓట్లను కో రిలేషన్‌ చేసి ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) ద్వారా వాటిని గుర్తిస్తారు. అప్పుడు డబుల్‌ ఓట్లు తేలతాయి. అప్పుడు ఫారం–ఏ, బీ ఇచ్చి ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి.. ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించాలి. అప్పుడు ఓటరు నిర్ణయం ప్రకారం ఓటు ఎక్కడ ఉండాలో తేలుస్తారు.

● సెప్టెంబర్‌ 22న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ఫారం–6 ఇస్తారు. అప్పుడు కొత్త ఓట్లు చేరుస్తారు. ఫారం–6 ఇప్పుడు కూడా ఓటరు అడిగితే ఇవ్వాలి. ఫారం–6 నిరంతర ప్రక్రియ.

● అలాగే ఫారం–8 ద్వారా బూత్‌ పరిధిలోని ఓటు మరో బూత్‌కు మారుస్తారు.

● ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం. అప్పుడు డబుల్‌ ఓట్లు తగ్గుతాయి. కచ్చితమైన ఓటరు జాబితా తేలుతుంది. పోలింగ్‌ శాతం పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు కూర్చుని మ్యాపింగ్‌ చేసినట్లు చేస్తే సర్‌ చేసినా ప్రయోజనం ఉండదు.

నియోజకవర్గం పూర్తయిన

మ్యాపింగ్‌ శాతం

ఆళ్లగడ్డ 88.61

శ్రీశైలం 88.59

నందికొట్కూరు 80.7

నంద్యాల 78.33

కోడుమూరు 79.13

పత్తికొండ 78.59

ఎమ్మిగనూరు 76.73

కర్నూలు 58.04

పాణ్యం 69.53

మంత్రాలయం 82.15

ఆదోని 84.54

.. ఇవన్నీ చూస్తే ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతోంది.

డోర్‌ టు డోర్‌ తిరగకుండా ఈ స్థాయిలో మ్యాపింగ్‌ చేయడం పట్ల రాజకీయ పార్టీల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement