● ఒకే రోజు 11 గ్రామాల్లో ఆలూరు ఎమ్మెల్యే పర్యటన
హాలహర్వి: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఒకే రోజు దాదాపు 11 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ల(బీఎల్‌ఏ) సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ ప్రజాస్వామ్యా న్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఎలాంటి అక్రమాలు జరిగినా తక్షణం స్పందించాలన్నారు.


