రీసర్వేలో జాయింట్‌ ఎల్‌పీఎంలు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

రీసర్వేలో జాయింట్‌ ఎల్‌పీఎంలు లేకుండా చూడాలి

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

కర్నూలు(సెంట్రల్‌): రీసర్వేలో జాయింల్‌ ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ )లు లేకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ, ప్లాంటేషన్‌, హౌసింగ్‌, జలధార–జలహారతి, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రీసర్వే ప్రక్రియలో జాయింట్‌ ఎల్‌పీలు ఒక గ్రామంలో రెండు శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదన్నారు. పట్టాదారు పాసు బుక్కుల జారీ, ఈకేవైసీ ప్రక్రియ, డ్రాఫ్ట్‌, తుది ఆర్‌ఓఆర్‌ తయారీలో 95 శాతం కచ్చితత్వం ఉండాలన్నారు. మ్యూటేషన్‌ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. సరైన పరిశీలన లేకుండా పట్టా భూములను ప్రభుత్వం భూములుగా, 22ఏ కింద, డాటెడ్‌ ల్యాండ్‌లుగా నమోదు చేస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. జూన్‌ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంపై పూర్తి స్థాయి దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ నూ రుల్‌ ఖమర్‌,డీఆర్వో సి.వెంకట నారాయణ మ్మ ,డీఎఫ్‌ఓ శ్యామల, హౌసింగ్‌ పీడీ నరసింహారెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రమణా రెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement