ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన చికిత్స | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన చికిత్స

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

కర్నూలు(హాస్పిటల్‌): ఆధునిక సాంకేతిక విధానాలతో రోగులకు కచ్చితమైన చికిత్స అందించగలుగుతున్నట్లు కర్నూలు మెడికల్‌ కాలేజి వైస్‌ ప్రిన్సిపాల్‌, ఏఎస్‌ఐ చైర్మన్‌ డాక్టర్‌ పి.హరిచరణ్‌ చెప్పారు. అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు మెడికల్‌ కాలేజీ ఆవరణలో సర్జికల్‌ వైద్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హరిచరణ్‌ మాట్లాడుతూ.. కర్నూలులో ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు సర్జన్స్‌ వీక్‌ వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా సర్జన్స్‌ వీక్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజల్లో శస్త్రచికిత్సలపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వైద్య సాంకేతికలపై చర్చలు, వైద్య విద్యార్థులు, యువ వైద్యుల కోసం శాసీ్త్రయ సమావేశాలు, ప్రజలకు ఆరోగ్య సూచనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ సెంట్రల్‌ ఈసీ మెంబర్లు డాక్టర్‌ ఎస్వీ రామమోహన్‌రెడ్డి, డాక్టర్‌ రామచంద్రనాయుడు, ప్రొఫెసర్లు డాక్టర్‌ కోటిరెడ్డి, డాక్టర్‌ మాధవిశ్యామల, డాక్టర్‌ జయరామ్‌, సెక్రటరి డాక్టర్‌ బిజి. రాహుల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయబాబు, అసిస్టెంట్లు, పీజీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement