ఆగమపాఠశాలకు 22 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఆగమపాఠశాలకు 22 మంది ఎంపిక

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహించిన వీరశైవ ఆగమపాఠశాలకు 22 మంది ఎంపికయ్యారు. స్థానిక చంద్రవతి కల్యాణ మండపంలో మంగళవారం వీరశైవ ఆగమ కోర్సులో ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. మొత్తం 25 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకోగా 22 మంది హాజరయ్యారు. వీరంతా ప్రవేశ అర్హతను పొందారు. కోర్సులో ప్రవేశ అర్హతను పొందిన వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఆగమ కోర్సు కాలపరిమితి 6 సంవత్సరాలు కాగా విద్యాభ్యాస సమయంలో విద్యార్థులందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ పరీక్ష నిర్వహణలో స్వామివారి ఆలయ ఉప ప్రధానార్చకులు, ఆగమ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.శివశంకరయ్య స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాము లు, పాఠశాల పర్యవేక్షకులు డి.రంగన్న, సంబంధిత గుమాస్తా, పాఠశాల వార్డన్‌ జి.శ్రీనివాసులు, ఆగమ పండితులు ఎం.శివయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement