నా ఫేవరేట్‌ రెజ్‌లర్‌ పెద్ది సార్‌! | - | Sakshi
Sakshi News home page

నా ఫేవరేట్‌ రెజ్‌లర్‌ పెద్ది సార్‌!

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

● దొర్నిపాడు యువకుడు గఫూర్‌

● దొర్నిపాడు యువకుడు గఫూర్‌

దొర్నిపాడు: ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో ‘అదే నాఫెవరేట్‌ రెజ్‌లర్‌ పెద్దిసార్‌’ అంటూ డైలాగ్‌ చెప్పి ఓ యువకుడు వెలుగులోకి వచ్చాడు. పెద్ది సినిమాలో డైలాగ్‌ చెప్పిన గఫూర్‌ సొంతూరు దొర్నిపాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అవ్వాతాత బీబీ, సత్తార్‌ మీరాంసా వద్ద ఉంటూ దొర్నిపాడు ప్రభుత్వ పాఠశాలలో 7వ వరకు చదివాడు. సినిమా నటుడు కావాలనే ఆసక్తితో హైదరాబాద్‌ వెళ్లి మెట్రోస్టేషనల్లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూశాడు. మధ్యవర్తుల ద్వారా తొలిసారిగా టీవీ సీరియల్‌ రంగులరాట్నంలో అవకాశం పొందాడు. చాలా మందికి దొర్నిపాడు యువకుడిగా తెలియదు. ఎవరా అని వెతికేసరికి మన ఊరి మనవడే అంటూ ప్రాచుర్యం పొందాడు.

నటించిన చిత్రాలు

అఖండ–2, పెద్ది చలన చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న డ్రాగన్‌ సినిమాలో ఒక పా త్ర పోషిస్తున్నాడు. అలాగే కార్తీకదీపం, గృహలక్ష్మి, మా అత్త బంగారం, ఇంటికి దీపం ఇల్లాలు, స్రవంతి, మట్టిగాజులు, పాపేమా జీవనజ్యోతి, రంగులరాట్నం వంటి సీరియల్స్‌లో నటించాడు.

Advertisement
 
Advertisement
Advertisement