రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

11న కోడుమూరులో జల సమర దీక్ష

పాణ్యం: మండల పరిధిలోని సుగాలిమెట్ట వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అండర్‌ బ్రిడ్జి ద్వారా శాశ్వత పరిష్కారం చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు. మంగళవారం ఆయన అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు, ఎస్‌డీపీఓ మందాజావళితో కలిసి బ్లాక్‌ స్పాట్‌ను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నేషనల్‌ హైవే, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో అండర్‌ బ్రిడ్జి కింద రోడ్డు వేసి పిన్నాపురం వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. కార్యక్రమంలో పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

కర్నూలు(సెంట్రల్‌) : కర్నూలు జిల్లా జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్లు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష తెలిపారు. ఇందులో భాగంగా జూన్‌ 11వ తేదీన కోడుమూరులో జల సమరదీక్షను చేపడుతున్నట్లు చెప్పారు. మంగళవారం బిర్లా కంపౌండ్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండ్రేవుల ప్రాజెక్టు హామీలకే పరిమితమైందన్నారు. ఈ నేపథ్యంలో చేపటే దీక్ష కార్యక్రమంలో జిల్లాలోని రైతులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు పులకుర్తి భాస్కర్‌, గూడూరు నాగిరెడ్డి, కేపీఎస్‌ సభ్యులు హరినాథ్‌, భార్గవ్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement