● డిప్యూటీ ఎంపీడీఓలతో డీపీఓ జి. భాస్కర్
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ కోరారు. మంగళవారం తన చాంబర్‌లో జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీఓలతో ఆయ న సమావేశం నిర్వహించారు. చెత్త సేకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం పలు గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం వెళ్లడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కోసిగి, సి. బెళగల్, గోనెగండ్ల మండలాల్లోని గ్రామాల నుంచి స్వచ్ఛరథం నిర్వహణకు సంబంధించి ఐవీఆర్ కాల్స్‌లో ప్రజలు అధిక సంఖ్యలో నెగిటివ్‌గా సమాధానాలు ఇచ్చారన్నారు. ఇక నుంచి నిర్ణయించిన షెడ్యూల్ మేరకు అన్ని గ్రామాలకు స్వచ్ఛరథం వెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే పన్నుల వసూళ్లపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.28 కోట్లు వసూలు చేయా ల్సి ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాని, తాగునీటి సరఫరాకు సంబంధించిన పైప్‌లు ఎక్కడైనా లీకేజీ ఉంటే వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో సమన్వయం చేసుకొని పైపులను మార్చాలన్నారు. అలాగే ట్యాంకులను ఎప్పటికప్పు డు శుభ్రం చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు డీఎల్‌పీఓ టి. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


