నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్‌

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

బనగానపల్లె : నాణ్యతకు, నమ్మకానికి మారు పేరు భారతి సిమెంట్‌ అని కంపెనీ టెక్నికల్‌ ఇంజినీర్‌ కిరణ్‌కుమార్‌, సేల్స్‌ ఆఫీసర్‌ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని నందవరం గ్రామంలో మౌలాలి సిమెంట్‌ దుకాణంలో తాపీ మేసీ్త్రలకు సిమెంట్‌ నాణ్యత, వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కిరణ్‌కుమార్‌, జీవన్‌రెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్‌ రోబోటిక్‌ టెక్నాలజీతో తయారవుతుందని, అల్ట్రాఫాస్ట్‌ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. ఇతర కంపెనీల సిమెంట్‌ ఐదు గంటల్లో సెట్‌ అవుతుందని, భారతీ అల్ట్రాఫాస్ట్‌ రెండు గంటల్లోనే సెట్‌ అవుతుందని తెలిపారు. ఈ సిమెంట్‌ ఎంతో దృఢత్వం కలిగి ఉండటంతో నిర్మాణాలు త్వరగా పూర్తవుతాయని పేర్కొన్నారు. అనంతరం భవన నిర్మాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి తాపీ మేసీ్త్రలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

చాగలమర్రి: మండల కేంద్రం చాగలమర్రిలోని భూమా నగర్‌కు చెందిన మల్లుగాళ్ల హరికృష్ణ(32) మంగళవారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవించే హరికృష్ణకు భార్యతో మనస్పర్థలు తలెత్తాయి. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి తల్లి మల్లుగాళ్ల నరసమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ఎం. రాజారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement