కర్నూలు(అర్బన్): అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పాతబస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి బుగ్గనతో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మాజీ మేయర్ బీవై రామయ్య తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సమ సమాజం, సమానత్వం కోసం ఆయన అనేక రూపాల్లో పరితపించి ఆచరణలో పెట్టారన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ ఆలీఖాన్, మాజీ డీవీఎంసీ సభ్యులు గద్ద రాజశేఖర్, నాయకులు గోల్డ్‌మెన్ శ్రీనివాసులు, కటారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


