నా దుస్థితి చూసైనా పెన్షన్ ఇవ్వండమ్మా!
కర్నూలు(సెంట్రల్): ‘‘మా ఊరు ఆదోని. నా వయసు 18 ఏళ్లు. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. నా కోసం ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. నా దుస్థితి చూసి మీరైనా పెన్షన్ మంజూరు చేయండమ్మా..’’ అని ఆదోని పట్టణలోని 40వ వార్డు చెందిన దివ్యాంగుడు చాంద్‌బాషా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని వేడుకున్నాడు. కుటుంబ సభ్యులు సోమవారం అతన్ని కలెక్టరేట్‌కు ఆటోలో తీసుకొచ్చారు. లోనికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోవడంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ నేరుగా అతని దగ్గరికే వచ్చి సమస్య తెలుసుకున్నారు. ప్రస్తుతం కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా పెన్షన్ మంజూరు చేస్తామని చాంద్‌బాషాకు హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
రెవెన్యూ క్లినిక్ ద్వారా అర్జీల స్వీకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూకు సంబంఽధించిన ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఇందుకోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా రిసెప్షన్, రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక అసైన్‌మెంట్, చుక్కల భూములు, అడంగల్ మార్పులు, ఇనాం భూములు, రీసర్వే సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటయ్యాయన్నారు.
నా దుస్థితి చూసైనా పెన్షన్ ఇవ్వండమ్మా!
నా దుస్థితి చూసైనా పెన్షన్ ఇవ్వండమ్మా!


