విద్యార్థులతో ముచ్చటించి..సౌకర్యాలపై ఆరాతీసి
హొళగుంద: శిక్షణలో భాగంగా మండల కేంద్రం హొళగుందకు వచ్చిన ట్రైనీ కలెక్టర్లు శివంసింగ్, శివానీ, శివణేంధరణ్, మైఖెల్, నిధి యా, ఆల్ప్రెడ్‌లు సోమ వారం ప్రభుత్వ పాఠశాలలను, అంగన్ వాడీ కేంద్రాలను, ప్రభుత్వ కార్యాలయాలను చుట్టేశారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజానగర్ కాలనీలోని కన్నడ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించి..విద్యాబోధన, సౌకర్యాలు తదితర వాటిపై ఆరా తీశారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. తర్వాత తహసీల్దారు కార్యాలయం, పోలీస్‌స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ చలవాది రంగమ్మ, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


