వీరబ్రహ్మేంద్ర స్వామికి మహానందీశుడి పట్టువస్త్రాలు
మహానంది: కాలజ్ఞాన రచయిత, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం మహానంది దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆదివారం మహానంది ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకరశర్మ, వనిపెంట జనార్ధనశర్మ, వేదపండితులు హనుమంతుశర్మ, అర్చకులు మూలస్థానం సుబ్బయ్యశర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య బ్రహ్మంగారి మఠానికి చేరుకుని అక్కడి పీఠాధిపతి ఈశ్వరాచారి వారికి పట్టువస్త్రాలు అందించారు. బ్రహ్మంగారి మఠం అధికారులు స్వాగతం పలకగా శాస్త్రోక్తంగా అందజేశారు.


