● తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
ఆలూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని భోగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో అయ్యప్ప మాలాధారులతో కలిసి ఆదివారం కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతులకు నివాళులర్పించారు. భక్తుల మృతి ఘటన నుంచి తప్పించేకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు.. జోగి రమేష్‌ను అరెస్టు చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆలూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఊరూరా ఏరులై పారుతోందని విమర్శించారు. ఇద్దరు యువకులు మద్యం సేవించడంతోనే చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారన్నారన్నారు. వైఎస్సార్‌సీసీ మండల అధ్యక్షడు మల్లికార్జున, జిల్లా నాయకులు రామాంజినేయులు, భాస్కర్, గిరి, ఎంపీటీసీ దేవరాజు,కో–అప్షన్ మెంబర్ మహబూబ్ బాషా, ఎల్లప్ప, వరుణ్, నాగప్ప, రంగన్న, అనిల్ హనుమతప్ప, నాగేంద్ర, బాషా, రెడ్డి, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.


