ఎంపీడీఓలుగా ఐదుగురికి పోస్టింగ్స్
కర్నూలు(అర్బన్): ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఐదుగురికి జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు పోస్టింగ్స్ ఇచ్చినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. పీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏ జిల్లాకు కేటాయించిన వారికి ఆ జిల్లాలోనే పోస్టింగ్స్ ఇచ్చినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి పదోన్నతులు వచ్చాయని తెలిపారు. బేతంచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వహిస్తున్న పీ దస్తగిరిబాబును కొలిమిగుండ్లకు, బనగానపల్లె ఏఓ ఎస్ నాగరాజును బనగానపల్లెకు, బండి ఆత్మకూరు డిప్యూటీ ఎంపీడీఓ వై రామక్రిష్ణవేణిని అవుకు, తుగ్గలి ఏఓ ఎస్‌ఎం భాషను కోసిగి, గోస్పాడు డిప్యూటీ ఎంపీడీఓ ఎం నాగ అనసూయను ఓర్వకల్ ఎంపీడీఓగా పోస్టింగ్స్ ఇచ్చామన్నారు.
చిరుత పాద ముద్రల
పరిశీలన
ఆస్పరి: ఆస్పరి సమీపంలోని నల్లవాగు దగ్గర ఆదివారం ఆదోని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ తేజస్వి, ఆలూరు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, బీట్ ఆఫీ సర్ బాలకృష్ణ చిరుత పాద ముద్రలు పరిశీలించారు. ఆస్పరి రైతులు రెండు రోజులు నుంచి ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని ఫారెస్టు ఆఫీసర్లుకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పరికి వచ్చారు. పాద ముద్రలను పరిశీలించి.. అవి చిరుతవి కాదని తోడేలివని రైతులకు వివరించారు. ఈసందర్భంగా ఆదో ని రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఒక వేళ చిరు త కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు, మహి ళలు ఒంటరిగా వెళ్లకుండా కొంత మంది గుంపు కలిసి వెళ్లాలని సూచించారు. పొలాలు దగ్గరకు చిన్న పిల్లలను తీసుకెళ్లకూడదన్నారు. వన్య ప్రాణులకు హాని కల్పించవద్దని రైతులకు సూచించారు.
నేడు డయల్ యువర్ సీఎండీ
కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన వినియోగదారులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 8977716661 నంబరుకు ఫోన్‌చేసి సమస్యల గురించి చెప్పవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులు 9133331912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను చెప్పవచ్చని తెలిపారు.


