ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం
● ఘనంగా కురువల కార్తీక వనభోజన కార్యక్రమం
కర్నూలు(అర్బన్): రాజకీయ పార్టీలకు అతీతంగా కురువలు ఐకమత్యంగా ఉంటే ఎలాంటి సమస్యకై నా పరిష్కారం లభిస్తుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, కర్నూలు, హిందూపురం ఎంపీలు బస్తిపాటి నాగరాజు, పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక పెద్దపాడు రోడ్డులోని శ్రీ భీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో 23వ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉసిరిక చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. కురువలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ తదితర అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కులానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. ఈ నేపథ్యంలోనే కురువ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హిందూపురం ఎంపీ పార్థసారథి రూ.25 లక్షలను ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్‌కుమార్, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీలీలమ్మ, అనిత, గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శేఖర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, ఐఆర్‌ఎస్ అధికారి యాదగిరి, తహసీల్దార్ ఆంజనేయులు, పాల సుంకన్న, గడ్డం రామక్రిష్ణ, కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ, డా.లక్ష్మి ప్రసాద్, నాయకులు కే కిష్టన్న, ఉపాధ్యక్షులు కత్తి శంకర్, ఉరుకుందు, ధనుంజయ, కేసీ నాగన్న, నాగశేషులు, తిరుపాల్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.


