బాటిల్‌ ఉంది జాగ్రత్త ! | - | Sakshi
Sakshi News home page

బాటిల్‌ ఉంది జాగ్రత్త !

Nov 3 2025 7:10 AM | Updated on Nov 3 2025 7:10 AM

బాటిల్‌ ఉంది జాగ్రత్త !

బాటిల్‌ ఉంది జాగ్రత్త !

ఇంట్లో కుక్క ఉంటే గేటుకు ‘కుక్కలు ఉన్నా యి.. జాగ్రత్త’ అంటూ బోర్డు తగిలిస్తారు. ఇక్కడ మాత్రం కుక్కలను భయపెట్టడానికి ఎర్ర నీళ్ల బాటిల్‌ ఉంచి.. బాటిల్‌ ఉంది జాగ్రత్త అంటూ శునకాలకే వార్నింగ్‌ ఇస్తున్నారు. కుక్కల బెడదతో కొందరు ఈ బాటిల్‌ మంత్రాన్ని వాడుతున్నారు. వీధి కుక్కలు ఇళ్ల ముందు మల, మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను పాడు చేస్తున్నాయని ప్రజలు బాటిల్‌ చిట్కాను అనుసరిస్తున్నారు. కుక్కలు ఇంటి ముందుకు రాకుండా పత్తికొండలో కొన్ని కాలనీ ప్రజలు ఓ బాటిల్‌ నీళ్లలో కొంత కుంకుమ వేసి బాటిల్‌ను తాడుతో ఇంటి గేటుకు, ప్రహరీకి వేలాడదీస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం పట్టణంలోని పలు వీధులకు విస్తరించింది. చాలా చోట్ల ఇంటి గేటుకు ఎర్ర రంగు నీళ్ల బాటిళ్లు వేలాడుతూ కని పిస్తున్నాయి. విషయం తెలియని చాలా మంది ఇదేమి పద్ధతి అంటూ ఆశ్చర్యపోతున్నారు. – పత్తికొండ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement