● చెట్టంతా ఆదర్శం
ఈ చిత్రం చూస్తుంటే ఇంటిపై టెంకాయ చెట్టును నాటారా అన్నట్లుగా ఉంది కదూ.. అసలు విషయం ఏమిటంటే.. ఆ చెట్టు ఇంటిపైనా కాదు.. ఇంటిలోనే ఉంది. అదేంది ఇంటిలో చెట్టు అనుకుంటున్నారా..! బేతంచెర్ల పట్టణం కోటపేట కాలనీకి చెందిన నాపరాయి పరిశ్రమ యజమాని రహిమాన్‌కు చెట్లు అంటే ఇష్టం. రెండేళ్ల క్రితం శిథి లావస్థకు చేరుకున్న పడగొట్టి నూతన ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే అప్పటికే ఏపుగా పెరిగిన టెంకాయ చెట్టును తొలగించకుండా ఇంటిని నిర్మించాడు. ప్రస్తుతం ఆ చెట్టు ఇంటికన్నా ఎత్తు పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఔరా అంటూ రహిమాన్‌ను అభినందిస్తున్నారు. – బేతంచెర్ల
● చెట్టంతా ఆదర్శం


