చిన్నారికి డెంగీ లక్షణాలు
వెల్దుర్తి: పట్టణంలో డెంగీ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం పట్టణంలోని రాణితోటకు చెందిన ఆరేళ్ల మానస డెంగీ జ్వరానికి గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల జ్వరం తీవ్రతరం కావడంతో తల్లిదండ్రులు మనోహర్, శిరీషలు కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డెంగీ లక్షణాలు తేలిన ట్లు నిర్ధారించారని తల్లితండ్రులు తెలిపారు.
దీపం అంటుకుని చిన్నారి మృతి
వెల్దుర్తి: దీపం అంటుకుని గా యాలపాలైన ఎనిమిదేళ్ల చిన్నారి రేవతి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం కోలుకోలేక మృతిచెందింది. గ్రామానికి చెందిన గొల్ల బుడ్డన్న, సు లోచన దంపతుల కుమార్తె రేవతి తన ఇంటి పక్క నే ఉన్న దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టే ప్రయత్నంలో ఉండ గా దీపారాధనకు ఉంచి దీపం దుస్తులకు అంటు కుని గాయాలపాలైంది. రేవతి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో 3వతరగతి చదువుతోంది. చిన్నారి ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి వారి కుటుంబానికి గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ కుమారుడు కృష్ణారెడ్డి అండగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సైతం ఆసుపత్రికి వెళ్లి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతిపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పట్టుబడిన వాహనాలకు
రేపు వేలం
నంద్యాల: పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ క్రిష్ణమూర్తి ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన 10 వాహనాలకు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలన్నారు. వివరాలకు నంద్యాల ఎకై ్సజ్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.


