అంతా ధ్వంసం
గతేడాది మహారాష్ట్ర దొంగల ముఠా దుశ్చర్యతో ప్రాజెక్టు పరిధిలోని ఆరు ఎత్తిపోతల పథకాల పంపుహౌస్‌ల్లో విలువైన సామగ్రి చోరీకి గురైంది. సామగ్రి సైతం దేనికీ పనికిరాకుండా ధ్వంసమైంది. మంత్రాలయం పరిధిలోని మూగలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్‌తో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి 1200 కేజీ కాపర్‌ను దొంగలించారు. పంప్‌హౌస్‌లో రూ.18 లక్షలు నష్టం వాటిల్లింది. మాధవరం స్టేజ్–1 పంపుహౌస్‌లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు, మూడు స్టార్టర్లు, ఇన్సులేటర్, బ్రేకర్స్, బ్యాటరీలను నాశనం చేశారు. అందులో 9 కాపర్ షీట్లను ఎత్తుకెళ్లారు. కారణంగా రూ.1.46 కోట్లు నష్టం జరిగింది. బసలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్‌లోనూ స్టార్టర్, బ్యాటరీలు, ఫీడర్లను ధ్వంసం చేయగా రూ.12 లక్షలు నష్టం వాటినట్లు కేసు నమోదైంది. ఎమ్మిగనూరు పరిధిలోని సోగనూరు స్టేజ్–1 పంపుహౌస్‌లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు, 1200 కేజీల కాపర్‌ను దొంగలించారు. పంప్‌హౌస్‌లో రూ.20 లక్షలు నష్టం జరిగింది. పూలచింత స్టేజ్–1, స్టేజ్–2 పంపుహౌస్‌లోనూ 4 ట్రాన్స్‌ఫార్మర్లు, కాపర్, ఆయిల్ ఎత్తుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం వాటిల్లింది. చిలకలడోణ స్టేజ్–1, స్టేజ్–2 పంపుహౌస్‌లో 4 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్, ఆయిన్ తీసుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం జరిగిందని ప్రాజెక్టు అధికారుల అంచనా.


