కర్నూలులో ‘ఐక్యత’ పరుగు
కర్నూలు టౌన్:సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొనిరాష్ట్రీ య ఏక్తా దివాస్ పేరుతో యూనిటీ రన్‌ను శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమై రాజ్‌విహార్ వరకు కొనసాగింది. రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడారు. రన్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు అడిషనల్ ఎస్పీ బహుమతులు అందజేశారు. ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపిక
సంజామల: సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ సంచాలకులు బాషా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ అఽథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో నవబంర్ 5 నుంచి 9 వరకు జరిగే అంతర్జాతీయ ఏసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో బాషా పాల్గొనున్నారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షబ్బీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు పరమేశ్వర్ రెడ్డి, భరత్ రెడ్డి, వసంత లక్ష్మి తదితరులు ఆయనను అభినందించారు.


