పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం
రుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్య త ఇస్తామని ఎఫ్‌డీపీటీ బి.విజయకుమార్ అన్నారు. ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ (ఎఫ్‌డీపీటీ)గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి రుద్రవరంరేంజ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎర్రచందనం కలిగిన రేంజి, వన్యప్రాణులకు ఆవాసమిచ్చే ప్రదేశం రుద్రవరం రేంజిని అన్నారు. వృక్ష సంపదను కూల్చడం, వన్య ప్రాణులను వేటాడటం వంటి వాటిని అరికట్టేందుకు డ్రోన్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కొండల్లో సాయుధ దళాలను రంగంలోకి దించుతామని, ఎలాంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సబ్‌డీఎఫ్‌ఓ శ్రీనివాసరెడ్డి, రేంజర్ ముర్తుజావలి ఉన్నారు.


